ఒకప్పటి సోవియట్ యూనియన్‌కు ప్రధానిగా పని చేసిన నికోలయ్ రిజ్‌కోవ్(94) కన్నుమూశారు. సోవియట్ యూనియన్ ఆర్థికంగా పతనమవుతున్నప్పుడు దానిని అడ్డుకోవడానికి రిజ్‌కోవ్ ఎంతగానో ప్రయత్నించారు.
మిఖాయిల్ గోర్బచెవ్ దేశాధినేతగా ఉన్నప్పుడు ఆరేళ్లపాటు ఆయన ప్రధానిగా పని చేశారు. ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించడంతోపాటు ఆర్థిక, రాజకీయ వాతావరణాన్ని మార్చేందుకు వారు ఎన్నో చర్యలు తీసుకున్నా 1991లో సోవియట్ యూనియన్ పతనమైంది.