కళ్యాణదుర్గం పట్టణంలోని ఎంపీ తలారి రంగయ్య క్యాంపు కార్యాలయంలో బుధవారం పశు వైద్యాధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. కళ్యాణదుర్గం సమన్వయకర్త మాట్లాడుతూ పశువులకు ఎలాంటి రోగాలు సోకకుండా ముందస్తుగా టీకాలు వేయాలన్నారు. మెడిసిన్ కూడా సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. ఎక్కడైనా పశువులు చనిపోతే వెంటనే ఇన్సూరెన్స్ వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. వైసీపీ నాయకులు, పశు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.