వేసవి కాలంలో ప్రజలకు తాగునీరు సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలని పలువురు అధికార, ప్రతిపక్ష పార్టీల కౌన్సిలర్లు అధికారులను కోరారు. బుధవారం గుంతకల్లు మున్సిపల్ కార్యాలయంలో చైర్ పర్సన్ భవాని అధ్యక్షతన కౌన్సిల్ సాధారణ సమావేశం నిర్వహించారు. సమావేశంలో టిడిపి, వైకాపా కౌన్సిలర్లు కృపాకర్, విద్యారాణి, బాషా మాట్లాడుతూ వేసవిలో ప్రజలకు తాగునీరు ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని కమిషనర్ వెంకట రమణయ్యను కోరారు.