చంద్రుడు: శివుడి తలపై ఉన్న నెలవంక మనస్సు స్థిరత్వానికి చిహ్నం.
పాము: మెడలో పాము తమోగుణ ధోరణులు శివుని ఆధీనంలో ఉండటానికి సూచిక.
త్రిశూలం: జ్ఞానం, కోరిక, పరిపూర్ణతకు చిహ్నం.
ఢమరుకం: సృష్టి ప్రారంభానికి, బ్రహ్మ శబ్ధానికి సూచిక.
రుద్రాక్ష: స్వచ్చత, సాత్వికతకు చిహ్నం.
గంగ: గంగదేవి భక్తికి నిదర్శనం.
పులి చర్మం: అన్ని శక్తులకు శివుడు అతీతుడని చెబుతారు.
భస్మం: ప్రతి జీవి బూడిదగా మారాలనే సందేశాన్ని ఇస్తుంది.