అనపర్తిలో ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణరెడ్డి, టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మధ్య వార్ నెలకొంది.
ఇవాళ అవినీతి ఆరోపణలపై నల్లమిల్లి బహిరంగ చర్చకు ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి ఇంటికి వెళ్లారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో టీడీపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. బహిరంగ చర్చకు అనుమతి లేదని పోలీసులు చెప్పారు. దాంతో నల్లమిల్లి పోలీసులను తోసుకుంటూ వెళ్లారు.