రష్యాలోని జైలులో కన్నుమూసిన ఆ దేశ ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్ని అంత్యక్రియలు నేడు జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున జనం రాకుండా ప్రభుత్వం భద్రతా బలగాలను మోహరించనుంది.
అయితే, అంత్యక్రియలను ప్రత్యక్ష ప్రసారం చేస్తామని నావల్ని మద్దతుదారులు ప్రకటించారు. నావల్నిని ప్రత్యర్థి పుతిన్ హత్య చేశారని ఆరోపించారు. మరోవైపు నావల్ని సహజంగానే మృతి చెందినట్లు జైలు అధికారులు తెలిపారు.