మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. వైసీపీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డితో బహిరంగ చర్చకు వెళ్ళకుండా రామవరంలో రామకృష్ణారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి ఆయనను కొవ్వూరుకు తీసుకళ్లారు. అయితే రామకృష్ణారెడ్డిని విడుదల చేయాలంటూ కొవ్వూరు జాతీయ రహదారిపై టీడీపీ నేతలు ఆందోళన చేపట్టారు. దీంతో కొవ్వూరు నుంచి అనపర్తి మండలం రామవరంలోని నల్లమిల్లి నివాసానికి తీసుకొచ్చారు. వైసీపీ ఎమ్మెల్యే బహిరంగ చర్చకు భయపడి తనను పోలీసులతో అరెస్ట్ చేయించారంటూ రామకృష్ణారెడ్డి ఆరోపించారు. తానే నైతికంగా గెలిచానని మాజీ ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు. వైసీపీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి అవినీతిపై అన్ని ఆధారాలు తన వద్ద ఉన్నాయని రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.