రాష్ట్రానికి హోదా అడిగితే అక్రమంగా అరెస్టులు చేయడం దుర్మార్గమని చలసాని శ్రీనివాస్ మండిపడ్డారు. ఏపీ ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో సీఎం జగన్ తాకట్టు పెట్టారని ఆరోపించారు. అందరితో కలసి ఉద్యమానికి తాను సిద్దమన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురాలేకపోవడం వల్ల ప్రజలు దారుణంగా నష్టపోయారన్నారు. విశాఖ ఉక్కును అమ్నుతుంటే సీఎం సిగ్గులేకుండా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడంలో సీఎం జగన్ ఘోరంగా విఫలమయ్యారన్నారు. సీఎం సొంత జిల్లాలో కడప ఉక్కు ఫ్యాక్టరీని ప్రారంభించలేక పోవడం సిగ్గు చేటన్నారు. సీఎం కనీసం తమ వినతి పత్రం తీసుకోకుండా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు.