అమెరికాలో స్టెఫానీ మైటో అనే 23 ఏళ్ల యువతి 80 ఏళ్ల వ్యక్తితో డేటింగ్ చేసింది. ఆయన చనిపోయిన తర్వాత తాను వృద్ధుడితో డేటింగ్ చేయడానికి గల కారణాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.
తన శరీరం, డబ్బు కోసం మాత్రమే యువకులు తన వెంటపడేవారని చెప్పింది. వృద్ధులు సాధారణంగా ప్రశాంతంగా, అవగాహనతో ఉంటారని భావించి తాను డేటింగ్ చేసినట్లు పేర్కొంది. అయితే తన మాజీ ప్రియుడు సైతం అందరిలాంటి మనిషే అని వెల్లడించింది.