ప్రజల్లో బలం లేని నేతలుగా చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌లు ఒంటరిగా మిగిలిపోయారు. ఎటూ పొత్తుల బేరంలో ఇరు పార్టీల కేడర్‌ల ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పుకోలేక.. మరోవైపు ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయిన పరిస్థితుల్లో వారు తమ మానసిక స్థితిపై పట్టు కోల్పోయినట్లు నోరుపారేసుకుంటున్నారు అని వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఏపీ తెలుగు, సంస్కృతం అకాడమీ చైర్‌పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి అన్నారు. ఆమె మాట్లాడుతూ.... ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న జగన్‌మోహన్‌రెడ్డి గారిపై చేసిన వారి విమర్శలు, ఆరోపణలను నేను పూర్తిగా ఖండిస్తున్నాను. వట్టి గొడ్డుకు అరుపులెక్కువని తెలుగు సామెత చందంగా చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ ఇద్దరూ కలిసి .. ‘అది చేస్తాం.. ఇది చేస్తాం.. పాతాళానికి తొక్కేస్తాం.. నేలమీద కూర్చోబెడతాం..’ అంటూ వాగారు. పవన్‌కళ్యాణ్ మరీ అంత రెచ్చిపోయి మాట్లాడాల్సిన అవసరమేంటి..? అసలు, నువ్వు చదువుకున్నోడివేనా..? నీకు సంస్కారం ఉందా..? అదేమంటే.. కాపు సోదరులను పట్టుకుని మనం భోజనాలు పెట్టలేం.. మంచి నీళ్లు పోయలేం కనుక అన్నీఇన్నీ సీట్లు అడగ్గకూడదని చెబుతావా..? ఒక రాజకీయ పార్టీ అధినేతగా అలా మాట్లాడటానికి నీకు సిగ్గుందా..? పార్టీ కేడర్, నీ అభిమానుల ప్రశ్నలకు సమాధానం చెప్పుకోలేని నువ్వు .. అధికారంలో ఉన్న ప్రత్యర్థి పార్టీ అధినేతపై దుమ్మెత్తిపోస్తావా..? నీకున్న రాజకీయ అర్హత.. స్థాయేంటో తెలుసా నీకు..? .. చంద్రబాబు, పవన్ కల్యాణ్ ల కన్నా పెద్ద సైకోలు, ఉన్మాదులు ఎవరైనా ఉంటారా..? అని ప్రశ్నించారు.