రౌడీ షీటర్స్ అసాంఘిక, చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని వికారాబాద్ పట్టణ సిఐ నాగరాజు అన్నారు. శుక్రవారం వికారాబాద్ పట్టణ పరిధిలోని రౌడీషీటర్స్ కు స్థానిక పోలీస్ స్టేషన్ లో కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన, కబ్జాలు, చట్ట వ్యతిరేకమైన పనులు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.