కర్ణాటక రాజధాని బెంగళూరులోని ప్రముఖ రామేశ్వరం కేఫ్ పేలుడు సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటనలో నిందితులు ప్రెషర్ కుక్కర్ బాంబును ఉపయోగించారని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెల్లడించారు.
'ఈ విషయంలో బీజేపీ రాజకీయం చేస్తోంది. వారి హయాంలో బాంబు పేలుళ్లు కూడా జరిగాయి. అప్పుడు బుజ్జగింపు రాజకీయాలు చేశారా..? ఉగ్రవాద చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని సిద్ధరామయ్య అన్నారు.