గురజాల స్థానిక పోలీస్ స్టేషన్లో పలు కేసుల్లో పట్టుబడిన వాహనాలకు సోమవారం వేలం నిర్వహించనున్నట్లు సీఐ బాలకృష్ణ శనివారం తెలిపారు. మద్యం కేసుల్లో పట్టుబడిన ద్విచక్ర వాహనాలను,
జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు వేలంపాట నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. రూ. 2 వేలు డిపాజిట్ చెల్లించి పాల్గొనాలని అన్నారు. మరింత సమాచారానికి పోలీస్ స్టేషన్లో సంప్రదించాలన్నారు.