రాష్ట్ర సచివాలయాన్ని తాకట్టు పెట్టి అప్పు తేవడమేంటని సీఎం జగన్‌ను టీడీపీ అధినేత చంద్రబాబు ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. ఇది రాష్ట్రానికి అవమానకరమని విమర్శించారు. ‘రూ.370 కోట్లకు రాష్ట్ర పాలనా కేంద్రాన్ని తాకట్టు పెట్టడమేంటి? జగన్ తాకట్టు పెట్టింది భవనాలను కాదు.
తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని. సీఎం సమున్నతమైన ఆంధ్రప్రదేశ్ బ్రాండ్‌ను నాశనం చేశారు. అసమర్థ, అహంకార పాలనలో ఏం కోల్పోతున్నామో ఆలోచించాలి’ అని పేర్కొన్నారు.