ఓబీసీల సంక్షేమం కోసం కేంద్రం తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో అమలు చేయడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి విమర్శించారు.
ఎస్సీ కమిషన్ తరహాలో ఓబీసీ కమిషన్కు చట్టబద్ధత కల్పించి, ప్రధాని మోడీ ఆ వర్గాలకు భరోసా ఇచ్చారని ఆమె కొనియాడారు. ఎన్టీఆర్ తర్వాత ఓబీసీల గురించి ఆలోచించింది కేవలం మోడీ మాత్రమేనని అన్నారు. సైనిక్ స్కూళ్లలో ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు కల్పించినట్లు ఆమె వెల్లడించారు.