అనుమతి లేకుండా అబార్షన్ చేస్తే చట్టరిత్యా చర్యలు ఉంటాయని అందరికీ తెలిసిందే. ఫ్రాన్స్ ప్రభుత్వం మాత్రం అబార్షన్ కు రాజ్యాంగ హక్కు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు ఓ చట్టాన్ని రూపొందించింది.
మహిళలకు గర్భంపై పూర్తి స్వేచ్ఛ ఇచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఫ్రాన్స్ ప్రభుత్వం వెల్లడించింది. దీంతో అబార్షన్ కు రాజ్యాంగ హక్కు కల్పించిన తొలి దేశంగా ఫ్రాన్స్ నిలిచింది.