పర్చూరు నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఎన్నికల ఏర్పాట్లలో మునిగితేలుతున్నారు. ఇందులో భాగంగా ఆదివారం ఆయన హైదరాబాదులో నివాసం ఉంటున్న పర్చూరు నియోజకవర్గ ఓటర్లతో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. జగన్ నిరంకుశ పాలనను అంతం చేయడానికి ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకోవాలన్నారు. పర్చూరులో చోటు చేసుకున్న దొంగ ఓట్ల తొలగింపు ఎపిసోడ్ ను వారికి వివరించారు. అర్హులైన ఏ ఒక్కరి ఓటు పోకుండా చూస్తానన్నారు.