పన్ను ఎగవేతలను పరిష్కరించడానికి అన్ని రాష్ట్రల, కేంద్ర జిఎస్టి అధికారుల ఎన్ఫోర్స్మెంట్ చీఫ్‌ల సదస్సును ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం ప్రారంభించనున్నారు. వస్తు సేవల పన్ను, జీఎస్టీ ఎగవేతల గురించి సదస్సులో చర్చకు రానుంది.
టెక్నాలజీని ఉపయోగించి నకిలీ ఇన్ వాయిస్ సమస్యను పరిష్కరించేలా దృష్టిసారించనున్నారు. జీఎస్టీ వసూళ్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఎలా మెరుగుపరచాలనే అంశంపై ఈ సదస్సులో చర్చ జరగనుంది.