మధ్యప్రదేశ్లోని ఇండోర్లో దారుణం జరిగింది. ఛత్రిపుర పోలీస్ స్టేషన్ పరిధిలోని తన ఇంట్లో నైనా సౌదే హత్యకు గురైంది. ఆమెను భర్త మిలింద్ సౌదే గొంతు నులిమి చంపినట్లు పోలీసుల విచారణలో తేలింది.
తన భార్య తరచూ ఫోన్లో మాట్లాడేదని, ఆమెకు వివాహేతర సంబంధాలున్నాయని మిలింద్ ఆరోపించాడు. కోపంలో ఆమెను గొంతుకు టవల్ బిగించి చంపినట్లు అంగీకరించాడు. దీంతో నిందితుడిని పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు.