ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆయన సతీమణి ప్రశాంతిరెడ్డి టీడీపీలోకి రావడం శుభపరిణామమని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. నేడు నెల్లూరు సభలో ఆయన మాట్లాడుతూ.. రాజకీయాల్లో సంపాదించాలని, దుర్మార్గపు పనులు చేయాలనే ఆలోచన వారికి లేదన్నారు. వీపీఆర్ లాంటి వారు రాజకీయాల్లో ఉండటం అవసరమన్నారు. సొంత డబ్బు ప్రజలకి ఖర్చుపెట్టే మనస్థత్వం వీపిఆర్‌దని చంద్రబాబు కొనియాడారు. డిప్యూటీ మేయర్ రూప్ కుమార్‌ని పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని చంద్రబాబు అన్నారు. జగన్ ఒక సైకో అని విమర్శించారు. మనమంతా బానిసలమని.. ఆయనేమో రాజని ఎవరైనా ప్రశ్నిస్తే వేధిస్తుంటారన్నారు. చేస్తానన్న పనులు ఎందుకు చేయవని జగన్‌ను ఎమ్మెల్యే కోటంరెడ్డి ప్రశ్నిస్తే వేధించారన్నారు. దీంతో ఏం చేసుకుంటావో చేసుకోమని కోటంరెడ్డి పోరాడారని తెలిపారు. అహంకారంతో ఇష్టానుసారంగా విధ్వంసం చేసిన వ్యక్తిని ఇంటికి పంపించాల్సిన అవసరం ఉందన్నారు. 5 కోట్ల ఆంధ్రుల కోసం, యువత భవిష్యత్తు కోసం, పుట్టబోయే బిడ్డల కోసం అందరూ ఆలోచించాలని చంద్రబాబు తెలిపారు.