టీడీపీ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్శి పార్టీని బలోపేతం చేయాలని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి వలవల బాబ్జి పార్టీ శ్రేణులకు సూచించారు. ఆదివారం స్థానిక పార్టీ కార్యాలయంలో ముఖ్య నాయకులు, క్లస్టర్, బూత్ ఇన్చార్జిలతో సమావేశాన్ని పట్టణ అధ్యక్షుడు పట్నాల రాంపండు అధ్యక్షతన నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ సూపర్సిక్స్ పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలనానరు. టిక్కెట్ విషయంలో పార్టీ కార్యకర్తలెవ్వరూ ఆందోళన చెందవద్దన్నారు. పార్టీ శేణుల మనోభావాలను తాను ఎప్పటికప్పుడు పార్టీ అధ్యక్షులకు చెబుతున్నానన్నారు. అనంతరం సూపర్ సిక్స్ పథకాలకు సంబంధించిన మెటీరియల్ను నాయకులకు అందజేశారు. పోతుల అన్నవరం, కిలపర్తి వెంకట్రావు, పరిమి రవికుమార్, వాడపల్లి సుబ్బరాజు, రాంలక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.