వైసీపీకి కీలక నేతలలో ఒకరైన మంత్రి గుమ్మనూరు జయరాం గుడ్ బై చెప్పేందుకు సిద్ధమయ్యారు. మంత్రి పదవికి.. పార్టీకి నేడు ఆయన రాజీనామా చేయనున్నారు. ఈ క్రమంలోనే గుమ్మనూరు జయరాం విజయవాడకు చేరుకున్నారు. ఆలూరు నుంచి భారీ కాన్వాయ్‌తో విజయవాడకు మంత్రి గుమ్మనూరు జయరాం సోదరులు బయలుదేరారు. సాయంత్రం టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరనున్నారు. మంత్రి గుమ్మనూరు జయరాం గుంతకల్లు టికెట్ ఆశిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa