నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ముఖ్య అనుచరుడు హజరత్ నాయుడుపై కేసు నమోదైనది. సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టాడనే నెపంతో హజరత్ నాయుడు ఇంటిని పోలీసులు చుట్టుముట్టి.. పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లేందుకు యత్నించారు. అదే ప్రాంతంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి సతీమణి, కుమార్తెల ఇంటింటి ప్రచారానికి ఆటంకం సృష్టించే ప్రయత్నం చేశారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కోటంరెడ్డి సంఘటన ప్రదేశానికి చేరుకుని పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాది కాలంగా ఎంపీ ఆదాల సొంత ఖాతాల్లో సైతం తమపై పోస్టింగులు పెడితే చర్యలు ఎందుకు తీసుకోలేదని పోలీసులపై మండిపడ్డారు.