అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వర్జీనియాలో జరిగిన రిపబ్లికన్ ప్రైమరీలో విజయం సాధించారు. వర్జీనియాలో రిపబ్లికన్ ప్రత్యర్థి నిక్కీ హేలీని ట్రంప్ ఓడించారు.
ట్రంప్ 64 శాతం ఓట్లను పొందగా, హేలీ కేవలం 34 శాతం మాత్రమే సాధించారు. దీంతో రానున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరుపున పోటీ చేయబోయే అభ్యర్థిగా అందరినీ ట్రంప్ వెనక్కి నెట్టారు. బైడెన్‌తో ఆయన తలపడడం దాదాపు ఖాయమైంది.