రానున్న లోక్సభ ఎన్నికల్లో ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుందనే దానిపై ఇండియా టీవీ-సీఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్ నిర్వహించింది. 25 లోక్సభ స్థానాలున్న
ఏపీలో అధికార వైసీపీ 15, టీడీపీ 10 సీట్లు గెలిచే అవకాశం ఉందని నివేదికలో పేర్కొంది. తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు అధికార కాంగ్రెస్ 9, బీజేపీ 5, బీఆర్ఎస్ 2, ఏఐఎంఐఎం ఒక స్థానంలో విజయం సాధిస్తాయని అంచనా.