హిందూపురం మండలం కొటిపి గ్రామంలో మంగళవారం రైతు డి. గంగప్ప వేసిన రాగి పంట వద్ద వ్యవసాయాధికారులు పంటకోత ప్రయోగం చేశారు. 5. 5 మీటర్ల పంటను పరీక్షించగా 20. 850కిలోల దిగుబడి వచ్చిందన్నారు. జిల్లా ముఖ్య ప్రణాళికాధికారి విజయ్‌కుమార్, డివిజనల్ గణాంకాధికారి మల్లికార్జున, మండల వ్యవసాయాధికారి సురేంద్రనాయక్ పాల్గొన్నారు.