ఎక్కడైనా పార్కింగ్ చేస్తే గంటకు మరీ ఎక్కువ అంటే రూ.100 ఉంటుంది. కర్ణాటక రాజధాని బెంగళూరులో మాత్రం పార్కింగ్ రేట్లు ఆకాశాన్ని అంటుంతున్నాయి.
బెంగుళూరు సిటీలో పెరుగుతున్న ట్రాఫిక్ జామ్ సమస్యను కొన్ని మాల్స్ అవకాశంగా మార్చుకుని క్యాష్ చేసుకుంటున్నాయి. వాహనాలు పార్క్ చేసేందుకు గంటకు ఏకంగా రూ.1000 చొప్పున ఫీజులు వసూలు చేస్తున్నాయి. దీనికి సంబంధించిన సైన్ బోర్డులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.