దేశ వ్యాప్తంగా తాగునీటి సరఫరాలో ఉత్తమ పర్యవేక్షణ చేస్తున్న మున్సిపాల్టీలకు కేంద్ర ప్రభుత్వం సర్వేక్షణ్ పథకం కింద అవార్డులు ప్రకటించింది. ఇందులో భాగంగా హిందూపురం మున్సిపాలిటీకి సర్వేక్షణ్ అవార్డు దక్కింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేంద్ర మంత్రుల చేతుల మీదుగా మున్సిపల్ చైర్పర్సన్ ఇంద్రజ, కమిషనర్ శ్రీనాథ్ రెడ్డి అవార్డు అందుకోనున్నారు.