ఏపీలో జగన్ గాలి తగ్గిందని... జగన్ ప్రభావం లేదని మాజీ కేంద్రమంత్రి చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉందని.. కానీ తమకు క్యాడర్ లేదని చెప్పుకొచ్చారు. 70 ఏళ్ల క్రితమే మద్రాస్ నుంచి ఆంధ్ర విభజన జరిగిందన్నారు. ఆచార్య రంగా ఆనాడే ఆంధ్రకు తిరుపతిని రాజధానిని చేయాలని డిమాండ్ చేశారని గుర్తుచేశారు. సంజీవ రెడ్డి రాజధానిని కర్నూల్ తీసుకెళ్లారన్నారు. అనంతరం దాన్ని హైదరాబాద్‌కు మార్చారన్నారు. 70 ఏళ్ళల్లో 5 సార్లు ఆంధ్రప్రదేశ్ రాజధాని మారిందని తెలిపారు. తిరుపతి రాజధానిగా ఉండాలనేది తన వ్యక్తిగత అభిప్రాయమని తెలిపారు. రాయలసీమ వెనకబడిన ప్రాంత రైతుల, కష్టాలు కన్నీళ్లు కనిపిస్తున్నాయన్నారు. రాయలసీమకు గోదావరి, కృష్ణ నీళ్ళు అన్నారు ఏమీ రాలేదన్నారు. రాయలసీమలో యువత నిరుద్యోగంతో ఆత్మహత్యలు పాల్పడుతున్నారన్నారు. బీటెక్ పాస్ అయ్యాయి బ్రాందీ షాప్‌లో పని చేస్తున్నారని తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలు తుళ్ళూరు కావాలని అంటున్నారన్నారు. తిరుపతి రాజధాని అయితే అందరికీ బాగుంటుందని.. లక్ష ఎకరాల ప్రభుత్వం భూమి ఉందన్నారు. రాయలసీమ సమస్యలు పరిష్కారం కావాలంటే ఒక పరిష్కారం తిరుపతి రాజధాని అని వెల్లడించారు. తిరుపతి రాజధాని కావాలనేది 70 ఏళ్ల నాటి ప్రతిపాదన అని చింతా మోహన్ పేర్కొన్నారు.