గిద్దలూరు పట్టణంలో భారతీయ జనతా పార్టీ నాయకులను బుధవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఎం జగన్ వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభించేందుకు దోర్నాలకు వస్తున్న నేపథ్యంలో సీఎం పర్యటనను బిజెపి నాయకులు అడ్డుకునే అవకాశం ఉండటంతో భారతీయ జనతా పార్టీ నాయకులను గిద్దలూరు పోలీసులు ముందస్తుగా నోటీసులు ఇచ్చి వారిని అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వారిని గిద్దలూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు.