ఆర్టికల్ 370 రద్దు తర్వాత ప్రధాని మోదీ తొలిసారి కశ్మీర్ వెళ్లారు. 15 కోర్ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు. పీఎం పర్యటనను పురస్కరించుకుని అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. భద్రతను భారీగా పెంచారు. గత నెల 20న మోదీ జమ్మూలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. అధికరణ రద్దు తర్వాత అక్కడకు 3 సార్లు వెళ్లిన ప్రధాని, కశ్మీర్ కు వెళ్లడం ఇదే ప్రథమం.