'కలలకు రెక్కలు' అనే పేరుతో ఓ సరికొత్త పథకాన్ని మహిళల కోసం తీసుకొస్తున్నట్లు నారా భువనేశ్వరి ప్రకటించారు. ఇంటర్ విజయవంతంగా పూర్తి చేసిన మహిళలు ఈ పథకం కింద దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.
ఈ పథకం కింద నమోదు చేసుకున్న మహిళలు తీసుకునే బ్యాంక్ లోన్ కు త్వరలో అధికారంలోకి రానున్న తెలుగుదేశం - జనసేన ఉమ్మడి ప్రభుత్వం బాధ్యత వహిస్తుందని భువనేశ్వరి తెలిపారు.