చీరాల నియోజకవర్గ జనసేన ఇన్ చార్జ్ పదవి నుండి వైదొలుగుతున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆమంచి స్వాములు శుక్రవారం ప్రకటించారు. ఆ మేరకు జనసేనాని పవన్ కళ్యాణ్, పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ లకు రాసిన లేఖ కాపీలను ఆయన మీడియాకు విడుదల చేశారు.
అనివార్య కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నానని ఆ లేఖలో స్వాములు పేర్కొన్నారు. చీరాల నుండి పోటీ చేయాలని ఆశించిన స్వాములుకు ఆ ఛాన్స్ రాకపోవడంతో కినుక వహించారని టాక్.