సాధారణంగా అడవిలో తోడేళ్లు ఎంతో తెలివిగా వేటాడతాయి. రాత్రి పూట అరుస్తూ జంతువులను తరుముతూ వేటని సాగిస్తాయి. మహారాష్ట్రలో తోడేళ్లు సముదాయం రాత్రి పూట అరవడం లేదని తాజాగా ఓ సర్వేలో తేలింది.
మానవ నివాసిత ప్రాంతాలు అటవీ ప్రాంతాల సమీపంలోకి విస్తరిస్తుండటం, రాత్రిళ్లు లైట్ల వెలుగులు, వాహనాల రాకపోకలు వంటి ఇతర కారణాలతో తోడేళ్ల జీవనానికి భంగం కలుగుతోంది. దీంతో అవి ఊళ వేయడం లేదని నివేదిక పేర్కొంది.