దేశీయ స్టాక్ మార్కెట్లు శరవేగంగా వృద్ధి చెందుతున్న వేళ యూబీఎస్ సెక్యూరిటీ వేసిన అంచనాపై ట్రేడ్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. నేషనల్ స్టాక్ ఎక్స్‌ఛేంజీ సూచీ వచ్చే ఏడాది మార్చికి 25 వేల మార్క్ అందుకుంటుందని తెలిపింది. ఇతర ఆర్థిక వ్యవస్థలతో పోలిస్తే భారత్ అత్యుత్తమ నిర్మాణాత్మక వృద్ధిని కనబరుస్తోందని పేర్కొంది. ఇటీవల 3.5 శాతం వృద్ధి నమోదు చేసిన నిఫ్టీ సూచీ 22 వేల వద్ద కొనసాగుతోంది.