బాపట్ల జిల్లా మేదరమెట్లలో ఆదివారం జరిగిన సిద్ధం సభలో ఒంగోలు మున్సిపల్ కార్మికుడు మురళీకృష్ణ మృతి చెందాడు. అతని మృతి పట్ల సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
మృతుని కుటుంబానికి రూ.10లక్షల ఆర్థిక సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. ఒక గ్యాలరీ నుంచి మరో గ్యాలరీకి వెళ్తున్న క్రమంలో అతను అస్వస్థతకు గురై మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.