పెండింగ్ వేతనాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సమగ్ర శిక్ష అభియాన్ (ఎస్ ఎస్ ఏ) ఉద్యోగులు సోమవారం భోజన విరామ సమయంలో ఫ్ల కార్డులను చేతపట్టి తమ నిరసనను వ్యక్తం చేశారు. ఏపీ ఎస్ ఎస్ ఏ ఎంప్లాయిస్ ఫెడరేషన్ జేఏసీ పిలుపుమేరకు డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండల విద్యాశాఖ కార్యాలయం ఎదుట ఎస్ ఎస్ ఎ లో పని చేస్తున్న వివిధ విభాగాలకు చెందిన ఉద్యోగులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.