అబద్ధాల చంద్రబాబు ప్రాపకం కోసం ఎల్లోమీడియా రోతరాతలు రాస్తోందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి మండిపడ్డారు. నెల్లూరులో క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి సోమవారం మీడియాతో మాట్లాడుతూ..... వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేదర మెట్లలో నిన్న జరిగిన ‘సిద్ధం’ సభకు ప్రజల నుంచి భారీగా స్పందన లభించింది. బాపట్ల, పల్నాడు, గుంటూరు, నెల్లూరు, తిరుపతి జిల్లాల నుంచి లక్షలాది మంది హాజరై ‘సిద్ధం’ సభను జయప్రదం చేశారు. గ్రామాల నుంచి వైఎస్ఆర్సీపీ నేతలు, పార్టీ కార్యకర్తలే కాకుండా ప్రజలు కూడా ఎవరికి వారు స్వచ్ఛందంగా తరలివచ్చారు అని అన్నారు.