ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీడీపీతోనే ఉద్యోగ కల్పన సాధ్యం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 11, 2024, 07:37 PM

ఉపాధి, ఉద్యోగాల కల్పన టీడీపీతోనే సాధ్యమని, ఉపాధి అవకాశాలు కల్పించే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని ఆ పార్టీ నియోజకవర్గ ఇనచార్జి కందికుంట వెంకటప్రసాద్‌ సూచించారు. పట్టణంలో ఆదివారం ప్రైవేట్‌ టీచర్స్‌ అసోసియేషన ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం టీడీపీతోనే సాధ్యమన్నారు. గత ఐదేళ్లుగా రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక యువత వలస బాట పట్టిందన్నారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేస్తామని గద్దెనెక్కిన జగన ఆ తర్వాత నిరుద్యోగులను మోసం చేశారన్నారు. వైసీపీ పాలకులు గంజాయి, మాదకద్రవ్యాల మాఫియాను ప్రోత్సహిస్తూ, వేలాది మంది యువత జీవితాలను నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు సృష్టించాలన్నా, ఉపాధి కల్పించాలన్నా చంద్రబాబుకే సాధ్యమన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయనకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు పవన కుమార్‌రెడ్డి, జనసేన బ్లూమూన శివశంకర్‌, వాల్మీకి పాఠశాల కరెస్పాండెంట్‌ అనికుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com