పొత్తు ధర్మంలో సీటు ఎవరికి కేటాయించినా గెలిపిస్తామని టీడీపీ కొయ్యలగూడెం మండల అధ్యక్షుడు పారేపల్లి నరేష్ అన్నారు. బయ్యన్న గూడెంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోలవరం నియోజకవర్గంలో పొత్తులో భాగంగా టీడీపీకి కేటాయించినా జనసేనకు కేటాయించినా కష్టపడి పనిచేసి ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపిస్తామన్నారు. నాయకులు, కార్య కర్తలు ఆ దిశగా పనిచేయాలని కోరారు. లెజండ్, బాలం గంగాధరం, కటికి రాధాకృష్ణ పాల్గొన్నారు.