సర్వోత్తమ న్యాయస్థానం ఆదేశాలు మేరకు ఎలక్ట్రోరల్ బాండ్ల వివరాలు ఎస్. బి. ఐ వెల్లడించాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. ఆ పార్టీ కేంద్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం సిపిఎం నాయకులు గుంతకల్లు పట్టణంలోని స్టేట్ బ్యాంకు ప్రధాన కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. అనంతరం బ్యాంకు చీఫ్ మేనేజర్ కె. హరిబాబు కు వినతి పత్రాన్ని అందజేశారు. నాయకులు డి. శ్రీనివాసులు, బి. శ్రీనివాసులు, దాసరి శ్రీనివాసులు పాల్గొన్నారు.