బెంగళూరు వాసుల నీటి కష్టాలు తీవ్రస్థాయికి చేరాయి. బోర్లు ఎండిపోవడంతో వాటర్ ట్యాంకర్ల ద్వారా ప్రభుత్వం సరఫరా చేస్తున్న నీళ్లు సరిపోక.. ప్రతీ నీటి చుక్కనూ జాగ్రత్తగా వాడుకుంటున్నారు. గొంతు తడుపుకోవడానికే సరిగా నీళ్లు దొరకక ఇబ్బంది పడుతుండడంతో వంట పాత్రలు కడగలేక ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ పెడుతున్నామని చెబుతున్నారు. గడిచిన నెల రోజుల్లో తాను కేవలం ఐదు సార్లు మాత్రమే స్నానం చేశానని ఓ టెకీ చెప్పాడు.