ఢిల్లీలో నకిలీ ఔషధ రాకెట్ గుట్టును పోలీసులు ఛేదించారు. ఏడుగురుని అరెస్టు చేశారు. ఢిల్లీ, గురుగ్రామ్‌లోని రెండు ఫ్లాట్లలో విపిల్ జైన్,
నీరజ్ చౌహన్‌తో పాటు మరో ఐదుగురు రూ.100 విలువ చేసే యాంటీ-ఫంగల్ మెడిసిన్‌ను ఖాళీ వయల్స్‌లో నింపి దాన్ని ‘ప్రాణాలు కాపాడే’ క్యాన్సర్ ఔషధంగా మార్కెట్లో విక్రయిస్తున్నారు. ఒక్కో వయల్‌ను రూ.లక్ష నుంచి రూ.లక్షల వరకు విక్రయించారు. ఇప్పటివరకు 7వేలకు పైగా ఇంజెక్షన్లను అమ్మినట్లు తెలిపారు.