ఒకే దేశం-ఒకే ఎన్నికలపై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటు అయిన హైలెవెల్ కమిటీ గురువారం నివేదికను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించింది.
ఒకేసారి లోక్‌సభ, అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే రాజ్యాంగాన్ని సవరించాల్సి ఉంటుందని కమిటీ పేర్కొంది. ఇందుకు ఐదు అధికరణలు సవరించాలని సూచించింది. అంతేకాకుండా ఎన్నికలకు ఉమ్మడిగా ఓటరు జాబితా సిద్ధం చేయాలని అభిప్రాయపడింది.