ట్రెండింగ్
Epaper    English    தமிழ்

34మందితో టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 14, 2024, 08:03 PM

తెలుగు దేశం పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేసింది. 34 మందితో రెండో జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో దాదాపుగా ప్రస్తుత ఇంఛార్జ్‌లకు అవకాశం ఇచ్చారు టీడీపీ అధినేత చంద్రబాబు. అయితే కొన్ని నియోజకవర్గాల్లో అనూహ్యంగా సీనియర్ నేతలకు కాకుండా వారసులకు టికెట్లు కేటాయించడం విశేషం.


నరసన్నపేట - భగ్గు రమణమూర్తి


గాజువాక - పల్లా శ్రీనివాసరావు


చోడవరం - కేఎస్‌ఎన్‌ఎస్ రాజు


మాడుగల - పైలా ప్రసాద్


ప్రత్తిపాడు - వరుపుల సత్యప్రభ


రామచంద్రాపురం - వాసంశెట్టి సుభాష్


రాజమండ్రి రూరల్ - గోరంట్ల బుచ్చయ్య చౌదరి


రంపచోడవరం - మిరియాల శిరీష


కొవ్వూరు - ముప్పిడి వెంకటేశ్వరరావు


దెందులూరు - చింతమనేని ప్రభాకర్


గోపాలపురం - మద్దిపాటి వెంకటరాజు


పెద్దకూరపాడు - భాష్యం ప్రవీణ్


గుంటూరు వెస్ట్ - పిడుగురాళ్ల మాధవి


గుంటూరు ఈస్ట్ - మహ్మద్ నజీర్


గురజాల - యరపతినేని శ్రీనివాసరావు


కందుకూరు - ఇంటూరి నాగేశ్వరరావు


మార్కాపురం - కందుల నారాయణరెడ్డి


గిద్దలూరు - అశోక్ రెడ్డి


ఆత్మకూరు - ఆనం రాంనారాయణరెడ్డి


కోవూరు - వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి


వెంకటగిరి - కురగొండ్ల లక్ష్మీప్రియ


కమలాపురం - పుత్తా చైతన్య రెడ్డి


ప్రొద్దుటూరు - వరదరాజులు రెడ్డి


నందికొట్కూరు - గిత్తా జయసూర్య


ఎమ్మిగనూరు - జయనాగేశ్వరరరెడ్డి


మంత్రాలయం - రాఘవేంద్రారెడ్డి


పుట్టపర్తి - పల్లె సింధూరా రెడ్డి


కదిరి - కందికుంట యశోదా దేవి


మదనపల్లి - షాజహాన్ బాషా


పుంగనూరు - చల్లా రామచంద్రారెడ్డి


చంద్రగిరి - పులిపర్తి వెంకట మణి ప్రసాద్ (నాని)


శ్రీకాళహస్తి - బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి


సత్యవేడు - కొనేటి ఆదిమూలం


పూతలపట్టు - డాక్టర్ కలికిరి మురళీమోహన్


తిరుపతి జిల్లా వెంకటగిరిలో టీడీపీ సీనియర్ నేత కురుగొండ్ల రామకృష్ణకు బదులు ఆయన కుమార్తె లక్ష్మీ ప్రియకు అవకాశం ఇచ్చారు. అలాగే కడప జిల్లా కమలాపురంలో పుత్తా నరసింహారెడ్డికి బదులు.. ఆయన కుమారుడు చైతన్యరెడ్డికి సీటు కేటాయించారు. పుట్టపర్తిలో కూడా పల్లె రఘునాథరెడ్డికి కాకుండా ఆయన కోడలు సింధూరాకు ఛాన్స్ దక్కింది. కదిరిలో కూడా కందికుంట ప్రసాద్‌కు కాకుండా ఆయన భార్య యశోదకు టికెట్ ఇచ్చారు. గుంటూరు జిల్లా పెద్దకూరపాడులో కూడా చంద్రబాబు మార్పు చేశారు.. సీనియర్ నేత కొమ్మాలపాటి శ్రీధర్‌కు బదులు భాష్యం ప్రవీణ్‌కు అవకాశం కల్పించారు.


34 మంది అభ్యర్థులతో ప్రకటించిన ఈ జాబితాలో ఒకరు పీహెచ్‌డీ చేసిన అభ్యర్థి, 11 మంది పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 9 మంది గ్రాడ్యుయేషన్ చేసినవారు ఉన్నారు. 8 మంది ఇంటర్మీడియెట్, ఐదుగురు 10వ తరగతి విద్యార్హతగా కలిగినవారు ఉన్నారు. మొత్తం అభ్యర్థుల్లో 27 మంది పరుషులు, ఏడుగురు స్త్రీలు ఉన్నారు. ఇక అభ్యర్థుల వయసు విషయానికి వస్తే 25-35 ఏళ్ల మధ్య వయసువారు ఇద్దరు, 36-45 ఏళ్లలోపువారు 8 మంది, 46-60 ఏళ్ల వయసున్నవారు 19 మంది, 61-75 ఏళ్లవారు ముగ్గురు, 75 ఏళ్లకుపైబడినవారు ఇద్దరు ఉన్నారు.


వచ్చే 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థుల మొదటి జాబితాను ఇప్పటికే ప్రజల ముందు ఉంచామని చంద్రబాబు ట్విట్టర్ వేదికగా తెలిపారు. ఇప్పుడు మరో 34 మంది అభ్యర్థులతో కూడిన రెండో జాబితాను ప్రజలు ముందుకు తెచ్చామన్నారు. అభ్యర్థుల ఎంపికలో ఎప్పటిలాగే, ఈ జాబితాలో కూడా ప్రజల అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇచ్చామన్నారు. టీడీపీ అభ్యర్థులందరినీ ఆశీర్వదించి గెలిపించాలని రాష్ట్ర ప్రజలను కోరుతున్నానన్నారు చంద్రబాబు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com