కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘పౌరసత్వ సవరణ చట్టం’ (సీఏఏ) అమలును నిలుపుదల చేయాలంటూ సుప్రీంకోర్టులో 237 పిటిషన్లు దాఖలయ్యాయి.
ఇండియన్ ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్) సహా పలువురు పిటిషన్‌దారులు సీఏఏ నోటిఫికేషన్‌లోని పలు నిబంధనల్ని కోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్లు అన్నింటిపైనా ఈ నెల 19న ఒకేసారి విచారణ జరపడానికి సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ అంగీకరించారు.