హింస, రీపోలింగ్‌కు ఆస్కారం లేని ఎన్నికలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఎక్కడ హింసాత్మక ఘటనలు జరిగినా ఎస్పీలదే బాధ్యత అని, ఘటనపై తక్షణం చర్యలు తీసుకోకపోతే ఎస్పీలపై చర్యలు తీసుకుంటామని సీఈఓ హెచ్చరించారు.
ఎన్నికల కోడ్ అమలు నుంచి పెయిడ్ న్యూస్‌లపై ప్రత్యేక దృష్టి పెడతామన్నారు. ఇప్పటివరకు రాజకీయ పార్టీల నుంచి 155 ప్రకటనల కోసం ఈసీకి దరఖాస్తులు వచ్చాయన్నారు.