ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో 30 ఏళ్ళు వైయస్ జగనే ముఖ్యమంత్రిగా ఉంటారని వైయస్ఆర్‌సీపీ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం పేర్కొన్నారు. నిన్న సీఎం వైయస్ జగన్ సమక్షంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం.. ఈ రోజు మీడియాతో మాట్లాడారు. జనసేన వేరే పార్టీలో కలవడం కాదు త్వరలోనే క్లోజ్ అయిపోతుందని జోస్యం చెప్పారు.. పిఠాపురంలో వైయస్ఆర్‌సీపీకి సునాయాసంగా ఉంటుందన్న ఆయన.. సినిమావాళ్లు అతీతులు కాదు.. మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తారు.. మా ఇంటికొస్తే ఏం తెస్తారు అనే విధంగా సినిమా వాళ్ల వ్యవహారం ఉంటుందని దుయ్యబట్టారు.175 సీట్లలో పోటీ చేస్తానంటే బీజేపీ లో చేరతా అని చెప్పాను.. మీరు పోటీ చేసే 5-6 సీట్లలో నన్ను లాగొద్దు అని చెప్పాను.. జనసేన 70-80 సీట్లలో పోటీ చేయకుండా.. 20 సీట్లు కోసం నేను ఎందుకు? అని ప్రశ్నించారు. పవన్ కల్యాణ్‌ను మొత్తం సీట్లు త్యాగం చేయమనండి.. ఇంకా బాగుంటుంది అంటూ సెటైర్లు వేశారు.ఎన్టీఆర్ తర్వాత సినిమా నటులను ప్రజలు నమ్మలేదు అన్నారు ముద్రడగ.. నిన్న సీఎం వైయస్ జగన్ సమక్షంలో వైయస్ఆర్‌సీపీలో చేరాను.. కొన్ని శక్తులు నన్ను ఇంతకాలం సీఎం వైయస్ జగన్‌కి దూరం చేశారు… కానీ, వైయస్ఆర్‌సీపీ పార్టీ ఫౌండర్స్ లో నేను ఒక్కడిని అన్నారు. వైయస్ జగన్ ను సీఎం చేయడానికి నా ప్రయత్నం చేస్తాను అన్నారు. మా కుటుంబం 1951 సినిమాలలోకి వచ్చేటప్పటికి ఇప్పుడు ఉన్న నటులు ఎవరూ పుట్టలేదన్నారు.. మేం రాజకీయాల్లోకి వచ్చేటప్పటికీ ఇప్పుడు ఉన్న వారికి ఏబీసీబీలు కూడా రావు అంటూ సెటైర్లు వేశారు. వారు సినిమాల్లో హీరో కావొచ్చు.. నేను రాజకీయాల్లో హీరో అని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో మొలతాడు లేని వాడు.. లాగు లేని వాడు.. కూఏడా నాకు పాఠాలు చెప్తున్నారని ఫైర్ అయ్యారు. మీది ఏంటి పొడుగు… ఎందుకు మీ దగ్గరకి రావాలి అని నిలదీశారు.