అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు, కనీస వేతనం అమలు, వేతనం పెంపుతోపాటు, సమ్మె కాలపు హామీలు అమలు చేయాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోషియేషన్ (ఏఐటీ యూసీ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జె. లలితమ్మ డిమాండ్ చేశారు. శనివారం రాయచోటి పట్ట ణంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో స్థానిక ఏఐ టీయూసీ కార్యాలయంలో సరోజమ్మ అధ్యతన అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసి యేషన్ అన్నమయ్య జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లా డుతూ జీవోలు ఇవ్వడం కాదని, హామీలను వెంటనే అమలు చేయకపోతే, ఎన్నికల తరు వాత మలిదశ ఉద్యమం ప్రారంభిస్తామని హెచ్చరించారు. సమ్మె కాలపు జీతాలు, మార్చి వరకు సంపూర్ణ పోషణ బిల్లులు, సెంటర్ల అద్దె లు, ఈవెంట్ బిల్లులు, కరెంటు బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ జిల్లా కన్వీనర్ నాగేశ్వరి, ఏపీ గిరిజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుక్కే విశ్వనాఽథ్‌నాయక్, ఏఐటీయూసీ రాయచోటి పట్టణ కార్యదర్శి పుల్లయ్య, సుజాత, జయలక్ష్మి, సుజాత, అనురాధ, తులసి, దుర్గా, విజయకుమారి తదితరులు పాల్గొన్నారు.