లాభాల్లో నడుస్తున్న ఉక్కు కర్మాగారం అమ్మకానికి పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేసిందని కాంగ్రెస్ సీనియర్ నేత రఘువీరా రెడ్డి అన్నారు. శనివారం నాడు కాంగ్రెస్ న్యాయ సాధన సభలో ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోదీ, సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ దీన్ని నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నారని మండిపడ్డారు. ఇలాంటి నాయకులకు ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు. లక్షల మంది జీవనాధారమైన ఉక్కు పరిశ్రమను చంపే ప్రయత్నం చేస్తున్నారన్నారు.స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్ర కుట్రలు చేస్తుందని రఘువీరా రెడ్డి అన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే స్టీల్ ప్లాంట్ రక్షణ సాధ్యమని మాజీ కేంద్ర మంత్రి జేడీ శీలం అన్నారు. రాష్ట్రంలో చేతకాని ప్రభుత్వం అడ్డుకొలేకపోతుందని మండిపడ్డారు. ఈ ప్రభుత్వానికి చిత్త శుద్ది లేదన్నారు. ప్లాంట్ అమ్ముకోవాలని కానీ నీరు ఇవ్వమని అడ్డు పడితే కేంద్రం దిగి వస్తుందన్నారు. బీజేపీనే కాదు రాష్ట్రంలోని పార్టీలను కూడా పక్కన పెట్టాల్సిన అవసరం ఉంటుందని జేడీ శీలం అన్నారు.